bihar: సొంత పార్టీ నాయకులే కుట్రలకు పాల్పడ్డారు: బీహార్ పీసీసీ అధ్యక్షుడు

  • కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం
  • టిక్కెట్లను అమ్ముకున్నారు
  • రాహుల్ కలవకుండా అడ్డుకున్నారు
బీహార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచారని ఆయన అన్నారు. కాంగ్రెస్ లోని నలుగురు నాయకులతో పాటు, మిత్రపక్షాలే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమని చెప్పారు. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేశారని... రాహుల్ గాంధీతో పాటు ఇతర అగ్రనేతలను కలవకుండా అడ్డుకున్నారని అన్నారు. పార్టీ హైకమాండ్ ను చీకట్లో దాచేశారని విమర్శించారు. 
bihar
congress
Rahul Gandhi

More Telugu News