Andhra Pradesh: జగన్.. మీకు పూర్తి సహాయసహకారాలు అందిస్తాను!: ప్రధాని నరేంద్ర మోదీ

  • ట్విట్టర్ లో స్పందించిన మోదీ
  • కలిసి పనిచేద్దామని ఆహ్వానం
  • ఏపీని కొత్త ఎత్తులకు తీసుకెళదామని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తుకు చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు.

ఈరోజు ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ..‘ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ కు శుభాకాంక్షలు. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తులకు చేరుకునేందుకు మనం కలసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jagan
Narendra Modi
Twitter

More Telugu News