Andhra Pradesh: ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’పై తొలి సంతకం పెట్టిన జగన్!

  • వచ్చే నెల నుంచి అందిస్తామని ప్రకటన
  • అవ్వాతాతలకు నెలకు రూ.2,250 పెన్షన్
  • ఈ మొత్తాన్ని దశలవారీగా రూ.3వేలకు పెంచుతామని వెల్లడి
నవరత్నాల్లో భాగంగా ప్రతీ అవ్వ, తాతలకు, వితంతువులైన అక్కచెల్లెమ్మలకు పెన్షన్ 3000కు పెంచుతామని తాను హామీ ఇచ్చానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్’ కానుక కింద అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి రూ.2,250 పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. దీన్ని వచ్చే ఏడాది 2500 చేస్తామనీ, మరుసటి ఏడాది 2,750కి పెంచుతామని, ఆ తర్వాత 3000కి తీసుకుపోతామని పేర్కొన్నారు.

ఈ ఫైలుపైనే తాను తొలిసంతకం పెడుతున్నానని ప్రకటించారు. అనంతరం ఫైలుపై జగన్ సంతకం పెట్టారు. నవరత్నాల పథకాల ద్వారా కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రజలకు లబ్ధి కలిగించాలని జగన్ అన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి నవరత్నాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister

More Telugu News