Andhra Pradesh: జగన్ రెడ్డీ.. మీకు ఇవే నా శుభాకాంక్షలు!: రాహుల్ గాంధీ

  • జగన్ కేబినెట్, ఏపీ ప్రజలకు అభినందనలు
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ చీఫ్
  • అభినందనలు తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి, పరుచూరి
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను ఎన్నుకున్న ఏపీ ప్రజలతో పాటు ఆయన మంత్రివర్గంలో చేరనున్న నేతలకు అభినందనలు తెలిపారు. మరోవైపు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ ది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. అలాగే ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జగన్ కు అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
Jagan
Rahul Gandhi

More Telugu News