Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రిగా జగన్.. స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

  • జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి
  • తెలుగు ప్రజలకు నా సహకారం ఉంటుంది
  • ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

ఈరోజు వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. @ysjagan @YSRCParty #Jagan’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Twitter

More Telugu News