Andhra Pradesh: జగన్ కు వెంకన్న అర్చకుల ఆశీర్వాదం.. ప్రసాదాన్ని కళ్లకు అద్దుకున్న వైసీపీ అధినేత!
- పండితులతో కలిసివచ్చిన ఈవో సింఘాల్
- సీఎంగా జగన్ విజయవంతం కావాలని ఆశీర్వాదం
- ఈరోజు మధ్యాహ్నం 12.23కు జగన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసానికి టీటీడీ వేదపండితులు చేరుకున్నారు. ఈవో సింఘాల్ తో కలిసి వచ్చిన వేద పండితులు జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ కు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలను అందజేశారు.
దీంతో స్వామివారి ప్రసాదాన్ని కళ్లకు అద్దుకున్న అనంతరం జగన్ నోట్లో వేసుకున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ పదవీకాలం విజయవంతం కావాలని పండితులు ఆశీర్వదించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.