kishan reddy: మోదీ మంత్రివర్గంలో కిషన్ రెడ్డి?.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం!

  • మంత్రవర్గంలో కిషన్ రెడ్డికి బెర్త్ దక్కే అవకాశం
  • స్వతంత్ర హోదాలో సహాయమంత్రి పదవి
  • నిన్ననే ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన కిషన్ రెడ్డికి మోదీ కేబినెట్ లో బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కిషన్ రెడ్డికి స్వతంత్ర హోదాలో సహాయమంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. నిన్ననే ఆయన ఢిల్లీకి చేరుకోవడం... ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో, కిషన్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది.
kishan reddy
bjp

More Telugu News