Andhra Pradesh: జగన్ కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ.. థ్యాంక్స్ చెప్పిన వైసీపీ అధినేత!

  • శుభాకాంక్షలు తెలిపిన బెంగాల్ సీఎం
  • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న జగన్
  • సుందరంగా ముస్తాబయిన ఇందిరాగాంధీ స్టేడియం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ జగన్ కు ఫోన్ చేశారు.

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. దీంతో జగన్ ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు జగన్ బంధువు హీరో మంచు విష్ణు ఈరోజు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
Jagan
YSRCP
mamata
manchu
vishnu

More Telugu News