YSRCP: నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

  • గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తల్లి కన్నుమూత
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తల్లి సుబ్బాయమ్మ వయసు 85 ఏళ్లు
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సుబ్బాయమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వయసు 85 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బాయమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మృతితో ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. తల్లిని కోల్పోయిన ఆయనకు పార్టీ నేతలు సంతాపం తెలియజేశారు.
YSRCP

More Telugu News