KCR: ఏపీలో రేపు కేసీఆర్ షెడ్యూల్ ఇదే!

  • ఉదయం 11 గంటలకు గన్నవరం రాక
  • గేట్ వే హోటల్ లో విశ్రాంతి
  • జగన్ ప్రమాణస్వీకారం అనంతరం ఢిల్లీ పయనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లగా అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మే 30న జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ కేసీఆర్ ను జగన్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.

అక్కడ్నించి 11.25కి గేట్ వే హోటల్ కు చేరుకుని లంచ్ పూర్తిచేసుకోనున్నారు. ఆపై 12.08 గంటలకు జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ పయనమవుతారు. అక్కడ నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, కేసీఆర్ తో పాటు జగన్, గవర్నర్ నరసింహన్ కూడా ఒకే విమానంలో ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.
KCR
Andhra Pradesh

More Telugu News