Jagan: మద్యం మత్తులో.. ఇంద్రకీలాద్రి పైనుంచి జారి లోయలో పడిన యువకుడు

షార్ట్స్‌లో చూడండి
మద్యం మత్తులో వున్న ఓ యువకుడు ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి కిందికి జారిపడడం తీవ్ర కలకలం సృష్టించింది. జగన్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తుండడంతో, ఇంద్రకీలాద్రి ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అదే సమయంలో కొండపై ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన ముగ్గురు యువకులు మద్యం సేవించి పేకాడుతున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులను చూసి ముగ్గురూ పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిలో శ్రీకాంత్ అనే యువకుడు పట్టుతప్పి కొండ పైనుంచి కిందికి జారిపోయాడు. కింద ఉన్న ముళ్లకంపలో చిక్కుకుపోవడంతో గాయాలయ్యాయి. అతడిని కాపాడిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు.  
Go Back to Shorts
Jagan
Vijayawada

More Telugu News