modi: మోదీ ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీ

  • రేపు రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ
  • హాజరవుతున్న పలువురు దేశ, విదేశీ ప్రముఖులు
  • రాహుల్ హాజరయ్యే విషయంలో అస్పష్టత
రేపు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ హాజరవుతున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ భావిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. మరోవైపు, రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు దేశాధినేతలతో పాటు, దేశంలోని వివిధ పార్టీల అధినేతలు హాజరవుతున్నారు. 
modi
oath
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News