revanth reddy: నా గెలుపుకు టీజేఎస్ కూడా ఓ కారణం: రేవంత్ రెడ్డి

  • ఎంతో నమ్మకంతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు
  • ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు
  • పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తుతా
విభజన హామీలను సాధించడంలో గత ఐదేళ్లలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తనను ఎన్నుకున్నారని... వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు చెంపపెట్టులాంటివని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరామ్ ను కోరానని... తన గెలుపుకు టీజేఎస్ కూడా ఓ కారణమని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాలని తనకు కోదండరామ్ సూచించారని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్, టీజేఎస్ అధినేత కోదండరామ్ లను రేవంత్ ఈరోజు కలిశారు. తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
revanth reddy
congress
Kodandaram
tjs
TRS

More Telugu News