Arvind Kejriwal: దేశవ్యాప్తంగా ఉన్న మోదీ హవా ఢిల్లీపైనా ప్రభావం చూపింది: కేజ్రీవాల్

  • కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీ ప్రెస్ నోట్
  • ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య పోటీగా మారాయి
  • ఢిల్లీలోనూ అలాగే భావించారు
సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమకు ఎదురైన ఘోరపరాజయం పట్ల ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వీచిన మోదీ పవనాలు ఢిల్లీపైనా ప్రభావం చూపించాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ద్వారా లేఖ విడుదల చేశారు. పార్టీ సేవకులు ఎంతో శ్రమించినా ఫలితాలు మాత్రం ఆశించినట్టుగా రాలేదని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావం ఢిల్లీపైనా పడిందని తెలిపారు.

 లోక్ సభ ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య పోటీ అన్నట్టుగానే ప్రచారం జరిగిందని, దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోరు నడిచిందని చెప్పారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకే ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయామని కేజ్రీవాల్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. మోదీ తరహా రాజకీయాలు ఢిల్లీలో తమ అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయని కేజ్రీ విశ్లేషించారు.
Arvind Kejriwal
Rahul Gandhi
Narendra Modi
New Delhi

More Telugu News