Andhra Pradesh: రేపు జగన్ ఇంటికి వెళ్లనున్న పయ్యావుల, గంటా, అచ్చెన్నాయుడు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లరాదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తనకు బదులుగా పార్టీ ప్రతినిధుల బృందాన్ని పంపాలని బాబు నిర్ణయించారు. తాజాగా ఈ బృందంలోని సభ్యుల పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు బృందాన్ని పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.

రేపు ఉదయాన్నే ఈ బృందం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెబుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాణస్వీకార వేదిక వద్దకు టీడీపీ బృందం వెళ్లరాదని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
Ganta Srinivasa Rao
achennaidu
payyavula

More Telugu News