ambika krishna: ఒకప్పుడు నేల టిక్కెట్టుకు వెళ్లేవాడిని .. ఇప్పుడు సినిమాలు తీసే స్థాయికి వచ్చాను: అంబికా కృష్ణ

  • ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను
  • 3 థియేటర్లకు ఓనర్ ను అయ్యాను
  •  10 సినిమాలను నిర్మించాను 
ఒక వైపున వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతూనే మరో వైపున రాజకీయ కార్యకలాపాలతో అంబికా కృష్ణ తీరిక లేకుండా వుంటారు. ఒక నిర్మాతగా చిత్రపరిశ్రమతోను ఆయనకి మంచి సంబంధాలు వున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఇదే ఏలూరులో నేను నేల టిక్కెట్టు తీసుకుని సినిమాకి వెళ్లేవాడిని. ఒక్కోసారి నేల టిక్కెట్టు దొరక్కపోతే వెనక్కి తిరిగొచ్చేసిన సందర్భాలు వున్నాయి.

ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూ 3 థియేటర్లకు ఓనర్ ను  అయ్యాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ను కూడా రన్ చేశాను. అలా సినిమాలు తీసే స్థాయికి ఎదిగాను. నా ప్రయాణం ఎక్కడ మొదలైంది .. ఎక్కడి వరకూ వచ్చాను అనేది చూసుకుంటే నాకు ఆనందం కలుగుతుంది. నేను ఇంతవరకూ పది సినిమాలు నిర్మించాను. వాటిలో 'కన్యాదానం' నాకు ఇష్టమైన సినిమా" అని ఆయన చెప్పుకొచ్చారు.
ambika krishna

More Telugu News