Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు చేసిన రామ్ గోపాల్ వర్మ!

  • వేర్వేరు సందర్భాల్లో పవన్ వ్యాఖ్యల ప్రస్తావన
  • ఎవరు చేశారో చెప్పాలని నెటిజన్లకు సవాలు
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి పరోక్ష విమర్శలు గుప్పించారు. పదో క్లాస్ లో 32 మార్కులతో పాసై, ‘తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు’ అని చెప్పింది ఎవరని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వర్మ ప్రస్తావించారు. ‘కింద ప్రస్తావించిన మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను ఊరికే అడుగుతున్నా’ అంటూ ఓ క్లిప్ ను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అందులో ‘జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు. జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా. పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు’ అంటూ వేర్వేరు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telangana
Pawan Kalyan
RGV
Twitter
criticise

More Telugu News