Chandrababu: జగన్ గెలుపుకు కారణం అదే!: చంద్రబాబు

  • జగన్ పై సానుభూతే వైసీపీని గెలిపించింది
  • ప్రజల కోపం వల్ల మనం ఓడిపోలేదు
  • ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు
జగన్ పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు టీడీపీపై కోపం లేదని, ప్రజల కోపం వల్ల మనం ఓడిపోలేదని చెప్పారు. ఓటమితో నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. టీడీపీ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు. ఒక సీటుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్... రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుందని, అదే రీతిలో మనం కూడా ముందుకు సాగాలని చెప్పారు.
Chandrababu
jagan
Telugudesam
ysrcp

More Telugu News