Jagan: కేవీపీ, కన్నా, చిరంజీవిలను ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్!

  • రేపు జగన్ ప్రమాణ స్వీకారం
  • పలువురికి ఫోన్లు
  • విజయవాడకు రావాలని ఆహ్వానం
రేపు మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలువురికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబును, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఆహ్వానించిన ఆయన, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సురవరం, సీతారాం ఏచూరి, కన్నా లక్ష్మీనారాయణ, చిరంజీవి, వామపక్ష నేతలు మధు, రామకృష్ణలకు ఫోన్ చేశారు. అలాగే కుటుంబ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావుకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. రేపు విజయవాడకు రావాలని అందరినీ ఆహ్వానించారు.
Jagan
KVP
Chiranjeevi
Oath

More Telugu News