Susrat Jahan: తాజా లోక్ సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీ... పెళ్లికి సిద్ధమట!

  • వెస్ట్ బెంగాల్ నుంచి ఎంపీగా సుస్రత్ జహాన్
  • వ్యాపారవేత్త నిఖిల్ జైన్ తో వివాహం
  • పెళ్లి తేదీ త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి
సుస్రత్ జహాన్... తాజా లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచిన సినీ తార. ఈ సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీ ఆమేనని సోషల్ మీడియా అంటున్న వేళ, తాను త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. తన ఎన్నో గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకునే సుస్రత్, త్వరలోనే కోల్ కతాకే చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను వివాహం చేసుకోనున్నారు. తన పెళ్లి ఎప్పుడో త్వరలోనే వెల్లడిస్తానని ఆమె తెలిపారు. "నాకు ఓటర్ల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇందుకు ధన్యవాదాలు. నేను స్వతహాగా ముస్లింను. అయినా అన్నివర్గాలవారూ ఓటు వేశారు. నేను మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందాను. నా తొలి ఓటును 18వ ఏట ఆమెకే వేశాను" అని సుస్రత్ వ్యాఖ్యానించారు.
Susrat Jahan
West Bengal
Lok Sabha
Marriage

More Telugu News