Jagan: క్యూలైన్లో వెళ్లి వెంకన్నను దర్శించుకున్న జగన్!

  • మహాద్వారం గుండా వెళ్లవచ్చన్న అధికారులు
  • లైన్లోనే వెళతానని స్పష్టం చేసిన జగన్
  • మరికాసేపట్లో స్వామి దర్శనం
"మీరు మహాద్వారం గుండా ఆలయంలోనికి వెళ్లి, శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని రావచ్చు" అని టీటీడీ అధికారులు స్పష్టం చేసినా, తాను మాత్రం అందరు భక్తులు వెళ్లే మార్గం ద్వారానే వెళ్లి స్వామిని దర్శించుకుంటానని స్పష్టం చేసిన జగన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా వెళ్లారు. ఈ ఉదయం తిరుమలలో సంప్రదాయ పంచె, కండువాతో స్వామి దర్శనానికి బయలుదేరిన జగన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి క్యూలైన్ లోకి ప్రవేశించి, తాను గతంలో నడిచిన దారిలోనే వెళ్లి ఆలయంలోకి ప్రవేశించారు. మరికాసేపట్లో జగన్ స్వామిని దర్శించుకోనున్నారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ తదితరులు ఉన్నారు. కాగా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామిని దర్శించుకున్న వేళ, ఆయన మహాద్వారం గుండా నేరుగా లోనికి వెళ్లిన సంగతి తెలిసిందే.
Jagan
Tirumala
Mahadwaram
kcr

More Telugu News