Pawan Kalyan: తన ప్రమాణ స్వీకారానికి పవన్‌ను ఆహ్వానించిన జగన్

  • పవన్‌కు ఫోన్ చేసిన జగన్
  • సానుకూలంగా స్పందించిన పవన్
  • టీడీఎల్పీ సమావేశంలో చర్చించాకే నిర్ణయం చెబుతామన్న టీడీపీ ఎంపీ గల్లా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఇప్పటికే పలువురు నేతలను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తదితరులను ఆహ్వానించారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్ ఆపై పవన్‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. జగన్ ఆహ్వానానికి పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు, జగన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు హాజరయ్యేది, లేనిది టీడీఎల్పీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 12:23 గంటలకు జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా 5 వేల మందితో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Pawan Kalyan
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News