Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • క్రేజీ ప్రాజక్టులో అనుష్క 
  • శివకు రజనీకాంత్ నుంచి పిలుపు 
  • విలన్లతో ఫైట్ చేస్తున్న రవితేజ
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చోళ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందే పిరీడ్ ఫిలింకు ఐశ్వర్య రాయ్ వంటి పలువురు ప్రముఖ తారలు ఇప్పటికే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందాలభామ అనుష్క శెట్టి కూడా ఇందులో నటించనున్నట్టు తాజాగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
*  ఇటీవల అజిత్ తో 'విశ్వాసం' చిత్రాన్ని రూపొందించి ఘన విజయం సాధించిన దర్శకుడు శివకు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రానికి ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారం.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో, విలన్ గ్రూప్ మధ్య యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
Anushka Shetty
maniratnam
ajith
Rajani

More Telugu News