Praveen: పాస్టర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయి: రాజాసింగ్ హెచ్చరిక

  • రాజేష్‌ను పొట్టనబెట్టుకొన్నారు
  • ప్రవీణ్ అరాచకాలపై విచారణ చేపట్టాలి
  • చార్టెడ్ ఫ్లెయిట్ కొనుగోలుకు సిద్ధమయ్యారు
పాస్టర్లకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తున్నాయో తేల్చాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోగం నయం చేస్తారని నమ్మి బెల్లంపల్లి కల్వరి చర్చికి వచ్చిన రాజేష్‌ను పాస్టర్ ప్రవీణ్ పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.

ప్రవీణ్ అరాచకాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రవీణ్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పాస్టర్‌ను అరెస్ట్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. విదేశాల నుంచి మతం పేరుతో వచ్చే డబ్బులతో పాస్టర్ ప్రవీణ్ చార్టెడ్ ఫ్లెయిట్ కొనుగోలుకు సిద్ధమయ్యారని రాజాసింగ్ ఆరోపించారు.  
Praveen
Rajasingh
Paster
Charted Flight
Bellampally
Rajesh

More Telugu News