Gutta Sukhender Reddy: గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ నిరాశే!

  • గుత్తాకే ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని ప్రచారం
  • నవీన్‌రావు పేరును ప్రకటించిన టీఆర్ఎస్
  • నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం
మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈసారైనా తనకు ఎమ్మెల్సీ టికెట్ లభిస్తుందని, ఎమ్మెల్సీ అయి.. మంత్రి అవుదామని అనుకున్నారు. కానీ ఆయన ఆశ అడియాసగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరును టీఆర్ఎస్ ప్రకటించడంతో మరోసారి గుత్తాకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. ముందు గుత్తాకే అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది కానీ చివరి నిమిషంలో నవీన్‌రావు పేరును ప్రకటించారు.
Gutta Sukhender Reddy
MLC
Naveen Rao
Naminations
TRS

More Telugu News