Telugudesam: కొత్త ప్రభుత్వానికి కొంత సమయమిద్దాం: చంద్రబాబు

  • వారిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారో చూద్దాం
  • నిర్మాణాత్మక ప్రతిపాక్ష పాత్ర పోషిద్దాం
  • ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
కొత్త ప్రభుత్వానికి కొంత సమయమిద్దామని, వారిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారో చూద్దామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్, కోడెల శివప్రసాద్, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితర నేతలు హాజరై నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్రాభివృద్ధి కోసం తమ వంతు ప్రయత్నం చేశామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎంతో చేశామని, కార్యకర్తల అభిప్రాయాలను ఆలకించి సమీక్ష చేసుకుంటామని చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని తమ నాయకులతో చంద్రబాబు అన్నారు.
Telugudesam
Chandrababu
YSRCP
jagan
guntur

More Telugu News