Chandrababu: చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన వైఎస్ జగన్!

  • నా తండ్రి వైఎస్ సమకాలికులు మీరు
  • మీ ఆశీస్సులు కావాలి
  • ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరిన జగన్ 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎల్లుండి జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, మీరు వస్తే తనకు ఆనందమని చెప్పారు. ఓ సీనియర్ నేతగా, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్, ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు వస్తారా? లేదా? అన్న విషయమై టీడీపీ అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 
Chandrababu
Jagan
Oath
Phone

More Telugu News