Narendra Modi: జగన్ పై మోదీ కామెంట్ కు అద్భుత స్పందన... వేలకొద్దీ లైక్ లు, రీట్వీట్ లు!

  • రెండు రోజుల క్రితం మోదీతో జగన్ సమావేశం
  • ఇంగ్లీష్ ట్వీట్ కు 64 వేల లైక్స్
  • తెలుగు ట్వీట్ కు 48 వేల లైక్స్, 6,100 రీట్వీట్స్
రెండు రోజుల క్రితం నరేంద్ర మోదీని వైఎస్ జగన్ కలిసిన తరువాత, మోదీ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన కామెంట్ కు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్వీట్ ను వేల మంది లైక్ చేసి, రీట్వీట్ చేయడం గమనార్హం. "ఆంధ్రప్రదేశ్‌ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను" అని ప్రధాని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంగ్లీషులో చేసిన ట్వీట్ కు ఇప్పటివరకూ 64 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 8,600 మంది రీట్వీట్‌ చేయగా, 1,800 మంది కామెంట్‌ చేశారు. ఇక అదే ట్వీట్ ను మోదీ తెలుగులోనూ చేయగా, 48 వేలకు పైగా లైక్స్, 6100 రీట్వీట్స్ వచ్చాయి. 1,500 మంది కామెంట్‌ చేశారు.
Narendra Modi
Jagan
Twitter

More Telugu News