NTR: ఎన్నికల తరువాత నేడు తొలిసారి బయటకు వచ్చిన చంద్రబాబు!

  • ఐదు రోజులుగా ఇల్లు దాటని చంద్రబాబు
  • నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల, నివాళులు
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు నేడు తొలిసారిగా బయటకు వచ్చారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉండవల్లి ప్రజావేదికను ఆయన వదిలారు. 23వ తేదీ నుంచి చంద్రబాబు ఉండవల్లిలోని తన ఇంటిని దాటి బయటకు రాలేదు. ఇంట్లోనే ఉండి తన వద్దకు వస్తున్న వారిని కలుస్తున్నారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవలో తనకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తున్నానని, ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుదామని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
NTR
Birthday
Chandrababu

More Telugu News