చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు శాంతించింది: మోత్కుపల్లి

  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు
  • ఎన్డీఆర్ నీడలోనే ఎదిగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
  • విమర్శల వర్షం కురిపించిన మోత్కుపల్లి
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయిన తరువాత ఎన్టీఆర్ ఆత్మ నిజంగా శాంతించిందని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన మోత్కుపల్లి, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ దని, చంద్రబాబు సైతం ఎన్టీఆర్ నీడలోనే ఎదిగారని ఆయన అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవడమే ఎన్టీఆర్ మరణానికి కారణమైందని, టీడీపీ జెండాను చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారని మోత్కుపల్లి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని తిరిగి బతికించుకోవాలంటే, చంద్రబాబు చేతుల్లోంచి పార్టీ పగ్గాలను నందమూరి ఫ్యామిలీ తీసుకోవాలని సలహా ఇచ్చారు.

NTR
Chandrababu
Motkupalli

More Telugu News