Nagababu: చంద్రబాబు నిరాయుధుడు... వదిలేయాలే తప్ప విమర్శిస్తే శాడిజం అవుతుంది: నాగబాబు

  • చంద్రబాబు మన మాజీ సీఎం
  • ఓడిపోయాక విమర్శించడం చేతకానితనం
  • ట్విట్టర్ లో నాగబాబు
పదవిని కోల్పోయిన చంద్రబాబు, ఇప్పుడు నిరాయుధుడని, ఆయన్ను వదిలేయాలే తప్ప విమర్శిస్తే అది శాడిజం అనిపించుకుంటుందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయనో ట్వీట్ పెట్టారు. "చంద్రబాబు మన మాజీ సీఎం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఆయనను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం" అని ఆయన అన్నారు.



Nagababu
Chandrababu
Twitter
Ex CM

More Telugu News