Chandrababu: నేడు గుంటూరుకు చంద్రబాబు.. ఇక గుంటూరు నుంచే పార్టీ కార్యక్రమాలు

  • ఎన్టీఆర్ జయంతి వేడుకలను ప్రారంభించనున్న చంద్రబాబు
  • మంగళగిరి పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు గుంటూరు నుంచే కార్యక్రమాలు
  • హాజరుకానున్న లోకేశ్, కళావెంకట్రావు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు గుంటూరు కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నేడు పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ఎన్టీఆర్ జయంతి వేడుకలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  కళావెంకట్రావు, మాజీ మంత్రి నారా లోకేశ్ సహా పలువురు నేతలు హాజరు కానున్నారు.
Chandrababu
Telugudesam
Guntur District
NTR

More Telugu News