Chandrababu: చంద్రబాబును పలకరించడానికి వచ్చిన మహిళాభిమానులు.. చంటిబిడ్డను ఎత్తుకుని ముద్దు చేసిన టీడీపీ అధినేత!

  • చంద్రబాబు నివాసంలో అభిమానుల సందడి
  • ఓటమికి బాధపడవద్దంటూ అభిమానుల ఓదార్పు
  • అధైర్య పడవద్దంటూ చంద్రబాబు సముదాయింపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ తన నివాసంలో అభిమానులను కలిశారు. ఎన్నికల్లో ఓటమి పట్ల బాధపడవద్దని అభిమానులు చంద్రబాబుతో చెప్పగా, తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని, ఇలాంటి ఎత్తుపల్లాలు ఎన్నో చూశానని, మీరేమీ అధైర్యపడవద్దంటూ వాళ్లకు ధైర్యం చెప్పి పంపారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఓ మహిళ నుంచి చంటిబిడ్డను తీసుకుని ముద్దు చేయడం అందరినీ అలరించింది. 'ప్రజాభిమానం సంపాదించుకున్నాం.. అది చాలు' అని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఎప్పటికీ అండగా ఉంటాం అంటూ అభిమానులు బాబుకు మాటిచ్చారు.
Chandrababu
Andhra Pradesh

More Telugu News