Dutee Chand: నాలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన భారత అథ్లెట్ ద్యుతీ

షార్ట్స్‌లో చూడండి
తాను ఓ అమ్మాయితో స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన భారత అథ్లెట్ ద్యుతీచంద్ మరోసారి కలకలం రేపింది. తాను ఎనిమిదో తరగతిలోనే ప్రేమలో పడ్డానని, అయితే తనలో మగ లక్షణాలు అధికంగా ఉన్నాయంటూ బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని వాపోయింది. 2014లో తామిద్దరం విడిపోయామని, అప్పటికి తనలో టెస్టోస్టెరాన్ స్థాయి అధికంగా ఉందని, మనిద్దరికీ పిల్లలు పుట్టనప్పుడు ప్రేమించుకుని ఏంచేద్దాం? అంటూ వదిలేసి వెళ్లిపోయాడని ద్యుతీ వివరించింది.

గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ గోల్డ్ మెడల్ గెలవడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఒలింపిక్స్ లో భారత ఆశాకిరణం ఆమేనంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, అకస్మాత్తుగా స్వలింగ సంబంధం తెరపైకి తీసుకువచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Go Back to Shorts
Dutee Chand

More Telugu News