Jagan: తాడేపల్లిలో ఈ సాయంత్రం జగన్ ను కలవనున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

  • మెరికల్లాంటి అధికారుల కోసం జగన్ అన్వేషణ
  • స్టీఫెన్ రవీంద్రకు ఆహ్వానం!
  • హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీనియర్ ఐపీఎస్!
ఏపీ కాబోయే సీఎం జగన్ పర్యటనలు, సమావేశాలతో  క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన మోదీని కలిసి ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. అనంతరం ప్రమాణస్వీకార ఏర్పాట్లపై అధికారులు చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు. ప్రస్తుతం తాడేపల్లి నివాసంలో ఉన్న జగన్ ను ఈ సాయంత్రం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది.

మరికొన్నిరోజుల్లో పరిపాలన ప్రారంభించనున్న జగన్ మెరికల్లాంటి అధికారుల కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉన్న స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారిని కూడా రాష్ట్రానికి రప్పించేందుకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో జగన్ పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన స్టీఫెన్ రవీంద్ర మరికాసేపట్లో జగన్ తో భేటీ అవుతారని తెలుస్తోంది.
Jagan

More Telugu News