Jagan: కాలేజీలో జగన్ ఓ సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయేవారు... డిగ్రీ క్లాస్ మేట్ స్పందన

  • జగన్ కు కాలేజీలో తగిన గౌరవం ఇచ్చేవాళ్లు
  • జగన్ గురించి మాట్లాడుకున్న క్లాస్ మేట్స్
  • ప్రగతి మహావిద్యాలయ పూర్వవిద్యార్థుల సమావేశం
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం, జగన్ సీఎం కానుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జగన్ తో బీకాం చదివిన క్లాస్ మేట్స్ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. జగన్ బొగ్గులకుంటలోని ప్రగతి మహావిద్యాలయ కాలేజ్ లో బీకాం చదివారు. ఆ సమయంలో జగన్ తో కలిసి చదువుకున్న కొందరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, జగన్ కాలేజీలో జాయిన్ అయ్యే సమయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్నారని వివరించారు. అయితే, జగన్ తానో ఎంపీ కుమారుడ్నన్న భావన లేకుండా అందరితో కలిసిపోయారని తెలిపారు. కాలేజీలో ఇతర విద్యార్థులు జగన్ కు తగిన గౌరవం ఇచ్చేవాళ్లని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కాగా, 1991 -94 మధ్య కాలంలో జగన్ ఆ కాలేజీలో బీకామ్ చదివారు.
Jagan

More Telugu News