Andhra Pradesh: హైదరాబాద్ లో బీరు లారీ బోల్తా.. డబ్బాలతో నింపుకుని పోయిన స్థానికులు!

  • నగరంలోని బేగంపేట వద్ద ఘటన
  • కారును తప్పించబోయి అదుపుతప్పిన లారీ
  • ఘటనాస్థలంలో భద్రతను కల్పించిన పోలీసులు
  హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర బీర్ లోడుతో ఓ లారీ బయలుదేరింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ పల్టీ కొట్టడంతో బీరు సీసాలు వాహనం నుంచి బయటపడ్డాయి.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. అనంతరం పనిలోపనిగా బీరు డబ్బాలను పట్టుకెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్ లను ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మరోవైపు బీర్ బాటిళ్లను ఎవ్వరూ తీసుకెళ్లకుండా పోలీస్ అధికారులు భద్రతను ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Hyderabad
Road Accident
beer lorry
Police

More Telugu News