ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రానున్న స్టీఫెన్ రవీంద్ర?
- గతంలో వైఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన రవీంద్ర
- ఫ్యాక్షన్, ఉగ్రవాద, మావో ఆపరేషన్లలో విశేష అనుభవం
- ఏరి కోరి ఎంపిక చేసుకున్న వైఎస్ జగన్
చాలా నిక్కచ్చిగా పనిచేసే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న స్టీఫెన్ రవీంద్రను జగన్ ఏరికోరి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే రవీంద్ర ఏపీకి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర అనంతపురానికి చెందినవారని అధికారిక వర్గాలు తెలిపాయి.