Rahulgandhi: ఏఐసీసీకి రాహుల్‌ నాయకత్వం తప్పనిసరి: సినీనటి విజయశాంతి

  • ఆయన విజ్ఞత, దార్శనికత ఉన్న మంచి వ్యక్తి
  • అహంభావంలేని నిరాడంబరపు మనిషి రాహుల్‌
  • ఆయన వైదొలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా
అపార దేశభక్తి, విజ్ఞత, దార్శనికత ఉన్న గొప్ప వ్యక్తి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అని పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. అంతటి గొప్పస్థానంలో ఉన్నా ఎటువంటి అహంభావంలేని నిరాడంబర మనిషి రాహుల్‌ అని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన సేవలు అత్యవసరమని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తిరస్కరించినప్పటికీ ఆయన కొనసాగేందుకు ఇష్టపడలేదు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి పదవి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఈ అంశం పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ గడచిన ఐదేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని సమర్థంగా నడిపించిన వ్యక్తి రాహుల్‌గాంధీ అన్నారు. అటవంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తి బాధ్యతల నుంచి తప్పుకుంటే నాలాంటి వారికి రాజకీయాల నుంచే తప్పుకోవాలనిపిస్తుందన్నారు. రాహుల్‌ పదవి నుంచి తప్పుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు.
Rahulgandhi
vijayasanthi
AICC president

More Telugu News