KCR: తిరుమల చేరుకున్న కేసీఆర్ కు టీటీడీ ఈవో సింఘాల్ స్వాగతం

  • రేపు స్వామివారిని దర్శించుకోనున్న తెలంగాణ సీఎం
  • రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస
  • కేసీఆర్ కు వైసీపీ శ్రేణుల నీరాజనాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్ తో తిరుమల చేరుకున్న కేసీఆర్ కు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ ను పద్మావతి అతిథి గృహం వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ రాత్రికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పద్మావతి అతిథి గృహంలో బసచేయనున్నారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు. కాగా, కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంతో వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. రేణిగుంట నుంచి అలిపిరి వరకు కేసీఆర్, జగన్ లతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.
KCR
Andhra Pradesh
Tirumala

More Telugu News