Jagan: జగన్ బయోపిక్ పై ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జగన్ జీవితం తెరకెక్కిస్తే ఓ అద్భుతమైన చిత్రం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ప్రభంజనం చూసి డీపీ సతీష్ అనే పాత్రికేయుడు న్యూస్18 మీడియా సంస్థ కోసం జగన్ పై ఓ కథనం రాశారు.

'సోనియా అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్రా శాపం: కాల్పనికతను మించిన ఇతివృత్తం జగన్ ప్రస్థానం' పేరిట రాసిన ఆ కథనం నేషనల్ మీడియాలో సంచలనం అయింది. దీన్ని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు ట్వీట్ చేయగా అనురాగ్ కశ్యప్ స్పందించారు. తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కొచ్చంటూ రీట్వీట్ చేశారు.
Go Back to Shorts
Jagan
Bollywood

More Telugu News