Narendra Modi: మోదీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్

  • మోదీకి వెల్లువెత్తుతున్న అభినందనలు
  • అభినందనలు తెలిపిన పలు దేశాల ప్రధానులు
  • ఇప్పటికే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్
తిరుగులేని మెజారిటీతో మరోసారి అధికారాన్ని దక్కించుకుని భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ప్రధానులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇటీవల ట్విట్టర్ ద్వారా మోదీకి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నేడు మరోసారి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్రాన్, పాక్, భారత్‌లలో ఉన్న పేదరికంపై సంయుక్తంగా పోరాడాల్సిన ఆవశ్యకతను మోదీకి తెలియజేసినట్టు సమాచారం. ఇరు దేశాలు అవలంబించాల్సిన కొన్ని విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Narendra Modi
Twitter
Imran khan
Pakistan
India

More Telugu News