Tollywood: నాడు 18 సీట్లు సాధించిన చిరంజీవి నా దృష్టిలో ‘బాహుబలి’: రామ్ గోపాల్ వర్మ

  • ‘జనసేన’ ఓటమిపై వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు
  • నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేశారో నాకు తెలియదు
  • విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ లో వర్మ
ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ కు హాజరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద విలేకరులు ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, నేడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిందని అన్నారు. పవన్ తో పోల్చితే పద్దెనిమిది సీట్లు సంపాదించిన చిరంజీవి తన దృష్టిలో ‘బాహుబలి’గా అభివర్ణించారు. జనసేన పార్టీ కంటే ప్రజారాజ్యం పార్టీ 18 రెట్లు బలమైందని చెప్పుకొచ్చారు. ‘జనసేన’ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి వర్మ వద్ద ప్రస్తావించగా, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తనకు తెలియదని సమాధానమిచ్చారు.  
Tollywood
Chiranjeevi
ram gopal varma
pawan

More Telugu News