bjp: ప్రధాని తర్వాత దేశంలో అత్యంత పవర్ ఫుల్ నేత అమిత షా: వైఎస్ జగన్

  • ఢిల్లీలో ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులను కలిశాను
  • రాష్ట్ర పరిస్థితులను వివరించా
  • పలు అంశాలపై సహకరించాలని అమిత్ షాను కోరా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై వైసీపీ అధినేత జగన్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని, ప్రధాని తర్వాత దేశంలో అత్యంత పవర్ ఫుల్ నేత అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సహకరించాలని అమిత్ షాను కోరానని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు జగన్ చెప్పారు. ‘నవరత్నాలు’ ఎలా అమలు చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు జగన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. కేంద్ర సాయం కోరింది అందుకేనని, రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.
bjp
modi
pm
YSRCP
jagan
new delhi

More Telugu News