Andhra Pradesh: సీఎంగా ఎన్నికైన జగన్ తో అద్భుతమైన సమావేశం జరిగింది: ప్రధాని మోదీ

  • ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగాయి
  • కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తా
  • జగన్ తో భేటీ అనంతరం మోదీ ట్వీట్ 
ఈ నెల 30న ఏపీకి కొత్త సీఎంగా వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారు. సుమారు గంటపాటు వీరి భేటీ జరిగింది. ఈ విషయాన్ని మోదీ తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎంగా ఎన్నికైన జగన్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని అన్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తన ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
jagan
pm
modi

More Telugu News