Andhra Pradesh: జగనన్న ప్రభుత్వం వచ్చింది.. రైతులంతా దైర్యంగా ఉండాలి!: విజయసాయిరెడ్డి

  • రెయిన్ గన్ల పేరుతో ఉత్తుత్తి ప్రచారాలు చేయం
  • సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతాం
  • సేద్యం పండుగలా మారే రోజులు వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ కరవు కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. ఏపీలో జగనన్న ప్రభుత్వం వచ్చిందనీ, ఇకపై రెయిన్ గన్లు వంటి ఉత్తుత్తి ప్రచారాలు కాకుండా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయం పండుగలా మారే రోజు వచ్చిందని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో మంచినీటి సమస్య లేకుండా జగన్ ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తారని పేర్కొన్నారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కరువు వల్ల నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి. జగనన్న ప్రభుత్వం వచ్చింది. రెయిన్ గన్ల ఉత్తుత్తి ప్రచారాలు కాకుండా కరువు నివారణకు శాశ్వత పరిష్కారాలు ఉంటాయి. సేద్యం పండుగలా మారే రోజులొచ్చాయి. ఇకపై మంచి నీటి సమస్య అనేది లేకుండా ఆయన ముందస్తు ప్రణాళికలు అమలు చేయిస్తారు’ అని తెలిపారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Vijay Sai Reddy
Chief Minister
Twitter

More Telugu News