Andhra Pradesh: ఢిల్లీకి చేరుకున్న జగన్.. మరికాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ!

  • ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుచేసిన అధికారులు
  • ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించనున్న జగన్
  • అనంతరం ఏపీ భవన్ కు ప్రయాణం
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ప్రత్యేక కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్ లో జగన్ ప్రధాని మోదీ నివాసానికి వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరనున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా పలు కీలకమైన అంశాలపై మోదీతో జగన్ చర్చించినున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీతో భేటీ అనంతరం జగన్ ఏపీ భవన్ కు ప్రయాణం అవుతారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Narendra Modi
BJP

More Telugu News