Jagan: 'అన్నా ప్లీజ్ ఆలస్యమవుతోంది'... అంటూ తెలంగాణ అభిమానులకు వాచ్ చూపించిన జగన్!

  • నిన్న హైదరాబాద్ కు వచ్చిన జగన్
  • కలిసేందుకు పెద్దఎత్తున వచ్చిన అభిమానులు
  • మళ్లీ కలుద్దామంటూ నచ్చజెప్పిన జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తొలిసారిగా వైఎస్ జగన్ హైదరాబాద్ కు వచ్చిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన జగన్ కు స్వాగతం పలికేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు పెద్దఎత్తున బేగంపేటకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్ కదిలే పరిస్థితి లేకపోవడంతో ఆయనే స్వయంగా కల్పించుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూనే, "గవర్నర్‌ను కలిసేందుకు సమయం అవుతోంది. అన్నా... ప్లీజ్‌... దారి వదలండి. ఆలస్యం అవుతోంది. మళ్లీ కలుద్దాం" అంటూ తన చేతి గడియారాన్ని చూపుతూ వారికి నచ్చజెప్పారు.
Jagan
Hyderabad
Telangana

More Telugu News