Jagan: ఢిల్లీ బయలుదేరిన జగన్, కాన్వాయ్ లో విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి మాత్రమే!

  • ఢిల్లీ బయలుదేరిన జగన్
  • నిన్ననే చేరుకున్న మరికొందరు నేతలు
  • 10.40కి మోదీతో సమావేశం
హైదరాబాద్, లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు. నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారన్న సంగతి తెలిసిందే. జగన్ కాన్వాయ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు మిధున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మరికొందరు నేతలు నిన్ననే ఢిల్లీకి చేరుకుని జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కాగా, ఈ ఉదయం 9 గంటల తరువాత ఢిల్లీ చేరుకోనున్న జగన్, 10.40కి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారన్న సంగతి తెలిసిందే. ఆపై మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ భవన్ కు వెళ్లి, అక్కడి అధికారులతో జగన్ సమావేశం కానున్నారు.
Jagan
New Delhi
Narendra Modi

More Telugu News