IT Grids: ఐటీ గ్రిడ్స్ అశోక్ కు కోర్టులో చుక్కెదురు

  • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఎల్బీనగర్ కోర్టు
  • దాకవరపు శ్రీలక్ష్మి, అబ్దుల్ బెయిల్ పిటిషన్లకూ అదే పరిస్థితి
  • అశోక్ కోసం కొనసాగుతున్న వేట
డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ చైర్మన్ దాకవరపు అశోక్ కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. అశోక్ తో పాటు ఐటీ గ్రిడ్స్ సంస్థ సభ్యులైన దాకవరపు శ్రీలక్ష్మి కమలాకర్, అబ్దుల్ ల బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. కాగా, డేటా తస్కరణ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. అశోక్ ఏపీలో తలదాచుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
IT Grids
Ashok
Andhra Pradesh

More Telugu News